విద్య- ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం

28-11-2026 | 04:46pm

చింతకింది కుమారస్వామి 

నల్లబెల్లి, నవంబరు 28( విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) 136వ వర్ధంతి సందర్భంగా నల్లబెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో(Nallabelli Gram Panchayat Office) ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి, సీపీఐ మండల కార్యదర్శి పరికి కోర్నేలు, రజక సంఘం గౌరవ అధ్యక్షులు వైనాల జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.సమాజంలో అసమానతలు, అంటరానితనాన్ని రూపుమాపి, విద్య ద్వారా బహుజనులలో చైతన్యం నింపిన మహనీయుడు పూలే అని కొనియాడారు. సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళా విద్యకు విశేష కృషి చేశారని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం పూలేను తన గురువుగా భావించారని గుర్తుచేశారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలంతా ఐక్యంగా నిలిచి రాజ్యాధికారం సాధించినప్పుడే పూలే ఆశయాలు నెరవేరుతాయని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోగలమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పోడేటి సాగర్, బొట్ల మొగిలి, లోనే లింగయ్య, మాసినపెళ్లి ప్రభాకర్, కోడూరు సిద్దు, కనకం భరత్, గుండెబోయిన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు