సెప్సిస్పై అవగాహన అవసరం
యూరాలజీ సంఘాల ప్రతినిధులు
హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): సెప్సిస్(Sepsis) అనేది ప్రాణాలకు ముప్పు కలిగించే తీవ్రమైన వైద్య అత్యవసర(Medical Emergency) పరిస్థితి అని సదరన్ యూరాలజిస్ట్స్, హైదరాబాద్ యూరాలజీ సొసైటీ, తెలంగాణ యూరాలజీ సొసైటీ ప్రతినిధులు(Representatives of the Telangana Urology Society) తెలిపారు. సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాపాయాన్ని నివారించవచ్చన్నారు.సదరన్ యూ రాలజిస్ట్స్ అధ్యక్షుడు డాక్టర్ జగదీశ్వర్ మాట్లాడుతూ సెప్సిస్పై అవగాహన పెంచడం అవసరమన్నారు.
హైదరాబాద్ యూరాలజీ సొ సైటీ అధ్యక్షుడు డాక్టర్ పి.వి.ఎల్.ఎన్. మూర్తి మాట్లాడుతూ జ్వరం, చలి, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలన్నారు.తెలంగాణ యూరాలజీ సొ సైటీ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.