కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మేయర్

19-11-2026 | 03:27pm

ముకరంపుర, నవంబర్ 19(విజయ క్రాంతి): రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను(Grain purchasing centers) ప్రారంభం చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్(Mayor Kolagani Srinivas) తెలిపారు. కరీంనగర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య తో కలిసి మేయర్ కొలగాని శ్రీనివాస్ ధాన్యం కొనుగోలు ప్రారంభం చేశారు.

అనంతరం నగరపాలక సంస్థ పరిది లోని బొమ్మకల్ ప్రాంతంలో  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తూకం వేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ కొలగాని శ్రీనివాస్ కు రైతులు, రైతు సంఘ నాయకులు శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ....  రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. కొనుగోలు కేంద్రం లో  రైతులకు  అవసరమైన గన్ని బ్యాగులు, టార్పలిన్లు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. కాంటా వేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా రవాణా చర్యలు తీస్కువేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

రైతులు కూడ నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వాలు కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని పిలుపు నిచ్చారు. ​ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి,  కార్పోరేటర్ మేకల వెంకటేష్, గాదే రూప శ్రీనివాస్, నాయకులు పురుమల్ల శ్రీనివాస్, రాంరెడ్డి, డైరెక్టర్లు బీరం ఆంజనేయులు, సాయిల్ల మహేంధర్, బోనాల లింగయ్య,  స్థానిక ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ, మార్కెట్ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు