పీఏసీఎస్ డైరెక్టర్ శేఖర్ రెడ్డికి ఘన సన్మానం

19-11-2026 | 03:34pm

భిక్కనూర్, నవంబర్ 19 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి (Peddamallareddy) పీఏసీఎస్ డైరెక్టర్‌గా (PACS Director) ప్రమాణ స్వీకారం చేసిన కంచర్ల గ్రామానికి చెందిన పెంజర్ల శేఖర్ రెడ్డిని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.

కంచర్ల గ్రామ మాజీ సర్పంచులు మట్టే మైపాల్ రెడ్డి, కుమ్మరి చంద్రం, భిక్కనూర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టే భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శేఖర్ రెడ్డి రైతులకు, గ్రామానికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బాలేముల బాపు రెడ్డి, పెంజర్ల బాపు రెడ్డి, పెంజర్ల స్వామి రెడ్డి, జిట్టె చంద్రం, బాలేముల సురేందర్ రెడ్డి, పెంజర్ల మహిపాల్ రెడ్డి, మట్టే స్వామి రెడ్డి, మడప సంతోష్ రెడ్డి, మేకల రాజు, బాలేముల నవీన్ రెడ్డి, మట్టే మహేందర్ రెడ్డి, అంబటి నర్సాగౌడ్, నాగొల్ల పోచయ్య, మడప తేజ రెడ్డి, నారాయణ బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు