పార్టీలకు అతీతంగా రైతుల కోసం పనిచేస్తా
భిక్కనూర్, నవంబర్ 19 (విజయ క్రాంతి): పార్టీలకు అతీతంగా రైతుల సంక్షేమం(Welfare of Farmers) కోసం పనిచేస్తానని భిక్కనూర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన పెద్దమల్లారెడ్డి పీఏసీఎస్ నూతన డైరెక్టర్ పెంజర్ల శేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కంచర్ల గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. తనపై నమ్మకంతో అభినందించిన గ్రామస్తులకు శేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంబటి సాయ గౌడ్, గొల్ల స్వామి, ఆశ రమేష్, తిరుపతి రెడ్డి, పోలు మహేందర్, గంగారెడ్డి, సతీష్, ఆశ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.