పన్నుల పెంపుపై బీఆర్ఎస్ ఆందోళన
మలుగులో భారీ ర్యాలీ
ములుగు, నవంబర్ 19 (విజయక్రాంతి): ములుగు మున్సిపాలిటీ(Mulugu Municipality) పరిధిలో ఇటీవల పెంచిన ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ములుగు మండల మాజీ అధ్యక్షులు సానికొమ్ము రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడి నాగజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, వ్యాపారవేత్తలపై ప్రభుత్వం అదనపు పన్నుల భారం మోపడం అన్యాయమని, పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో నివసిస్తున్న సామాన్య ప్రజలు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోవైపు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న వ్యాపారవేత్తలు కూడా అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వారు అన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి పన్నులు, వాణిజ్య పన్నులను భారీగా పెంచి ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి చేయాలి తప్ప ప్రజల పన్నులను గణనీయంగా పెంచి కాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పోమ నాయక్,
జిల్లా నాయకులు వేములపల్లి బిక్షపతి, ఎంపిటిసి ల ఫోరం మాజీ జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్ రామ్ నాయక్, భూక్య జంపన్న,ములుగు కార్పొరేటర్లు బైకాని సునీత ఓదెలు, బైకాని సాగర్, గండ్రకోట వాణి కుమార్, వేణు, లక్ష్మీ, భరత్, యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేష్, మాజీ ఎంపిటిసి గొర్రె సమ్మయ్య, గరిగె రఘు, పైడిమల్ల భాస్కర్ ,
సంతోష్, ముంజాల బిక్షపతి, రాణా ప్రతాప్, రవిరామన్ , సారయ్య, మాజీ ఎంపీటీసీ వంకూడోతు రాందాస్, మోహన్, నవీన్, గండి కుమార్, ఆకుతోట చంద్రమౌళి, శేఖర్, కార్తీక్, చంటి, రంజిత్, భరత్, సతీష్ పాల్గొన్నారు.