గ్రామ అభివృద్ధి, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత..

19-11-2026 | 03:23pm

పొనకల్ జనరల్ బాడీ సమావేశం 

జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గ్రామపంచాయతీ(Ponakal Gram Panchayat) కార్యాలయంలో గురువారం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి చేపట్టాల్సిన పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవడంతో పాటు అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేసిన పెన్షన్ దరఖాస్తు ఫారాలను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు మిగిలిన లబ్ధిదారులకు పొనకల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పల జలపతి, వార్డు సభ్యులు మోసిన్, మల్లయ్య, సంతోష్, అంజన్న, ప్రమీల, రాజన్న, రవి, ఈవో రాహుల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు