టీయుడబ్ల్యూజే (హెచ్-143) రాష్ట్ర కౌన్సిల్..

19-11-2026 | 03:20pm

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టియుడబ్ల్యూజే– హెచ్-143)(Telangana Union of Working Journalists) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా మహబూబాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ ఏటూరోజు రాజ్ కుమార్  ఎన్నికైనట్లు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ ప్రకటించారు.

మహబూబాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా రాజ్ కుమార్ ఎన్నిక పట్ల పలువురు జర్నలిస్టులు హర్షం  వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఏటూరోజు రాజ్ కుమార్ ప్రస్తుతం హెచ్ ఎం టీ వీ లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు