భీంపూర్ లో ఘనంగా బిర్సముండా జయంతి..

15-11-2026 | 04:01pm

తాంసి/భీంపూర్, నవంబర్ 15 (విజయక్రాంతి): భీంపూర్ మండల కేంద్రంలో ఆదివారం బిర్సముండా 151 జయంతి(Birsa Munda Jayanti)ని ఆదివాసీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ అంటూ ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన యోధుడు బిర్సముండా అని కొనియాడారు. గిరిజన సంస్కృతిని, అస్తిత్వాన్ని కాపాడంలో ఆయన పోరాటం అద్భుతమైందని అన్నారు.. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాడవి లింబాజి, పురుషోత్తం, దత్తు, రవీందర్, మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు