గురు శ్రేష్ట అవార్డు అందుకున్న నాగభూషణం
బైంసా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా తెలంగాణ గుర్తింపు ప్రైవేటు పాఠశాల యాజమాన్య సంఘం (టిఆర్ఎస్ ఎంఏ) సంఘం గురు శ్రేష్ట అవార్డు(Guru Shreshta Award)ను బాసర నాగభూషణం స్కూల్ కరెస్పాండెన్స్ నాగభూషణం అందుకున్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య గణేష్ చక్రవర్తి చేతుల మీదుగా అవార్డుతో పాటు సన్మానాన్ని అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయం విద్యా ప్రమాణాలు మానవ విలువలు పెంచేందుకు కృషి చేస్తున్న సేవలకు గాను ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు శ్రీనివాస్ గౌడ్ అయ్యన్న గారి శ్రీధర్ సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు