రూ. 60వేల కోట్ల బకాయిలను సుమోటోగా తీసుకోవాలి..

15-11-2026 | 03:58pm

బెల్లంపల్లి: తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నుంచీ సింగరేణినీ కాపాడేందుకు యజమాన్యం పెండింగ్ బకాయిలను వసూలు చేయాలని ఏఐటీయూసీ కేంద్ర ఉపాధ్యక్షుడు మిట్టపల్లి వెంకటస్వామి(AITUC Vice President Mittapalli Venkataswamy) డిమాండ్ చేశారు. బెల్లంపల్లి సీపీఐ కార్యాలయంలో ఆదివారం జరిగిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధికి కావలసిన నిధుల కొరతను సింగరేణి ఎదుర్కొంటున్నదన్నారు. ట్రాన్స్కో జెన్కో సంస్థల నుండి రావలసిన రూ. 60 వేలకోట్ల బకాయిల ఇష్యూను సుమోటోగా హైకోర్టు తీసుని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కంపెనీ స్థాయిలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్లో జరిగినా ఒప్పందాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్ ఒప్పందాలను పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సబ్ సెక్షన్ 22 సెక్షన్ 2 ప్రకారం అమలు చేయకుండా విస్మరించారని మండిపడ్డారు. నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింగరేణి మేనేజ్మెంట్ అబ్నార్మల్ సిచువేషన్ కన్పిస్తున్నదని విమర్శించారు. గత రెండు సంవత్సరాలుగా సేఫ్టీకి సంబంధించిన మెటీరియల్ సప్లై జరగడంలేదని ఆరోపించారు.

కంపెనీ వద్ద నిధులు లేకపోవడంతో సింగరేణి కార్మికులకు రక్షణ పరికరాలు సప్లైయిలో నిర్లక్ష్యం జరుగుతున్నదని తెలిపారు. పరోక్షంగా యజమాన్యం, ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల ఉత్పత్తికి ఉత్పాదకతకు నష్టం వాటిల్లుతుందనీ వాపోయారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం  గుర్తింపు సంఘంతో ఆగస్టు 27న జరిగిన స్టక్చరర్ మీటింగ్ మినిట్స్, అగ్రిమెంటును తక్షణమే అమలు చేయాలని కోరారు. ప్రతి నెల మెడికల్ బోర్డును క్రమం తప్పకుండా నిర్వహిస్తూ, 1981లో జరిగిన వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ ఒప్పందం ప్రకారం.. అల్లులు, కొడుకులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

సింగరేణి కంపెనీ మ్యానువల్ ప్రకారం కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మెడికల్ ఫిట్నెస్ అయిన డిపెండెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. విజిలెన్స్ విచారణకు తావు లేకుండా మెడికల్ ఫిట్నెస్  డిపెండెంట్ లందరికీ ఉద్యోగ నియమకా పత్రాలు ఇవ్వాలని పునరుద్ఘాటించారు. నవంబర్ 18,19 తారీకులలో అన్ని జీఎం ఆఫీసుల ముందు జరుగు రిలే నిరాహార దీక్షలో కార్మికులు, డిపెండెంట్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సిపిఐ టౌన్ కార్యదర్శి ఆడపు రాజమౌళి, మండల కార్యదర్శి బొంతుల లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు రత్నం ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు