ఎమ్మెల్యే బొజ్జు పటేల్ నివాసంలో ఘనంగా దండారి మహోత్సవాలు
అలరించిన దండారి నృత్యాలు మార్మోగిన డప్పుల మోత...
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దండారీలు నాయకులు, ఆదివాసి మహిళలు
ఉట్నూర్, నవంబర్ 9 ( విజయక్రాంతి ): ప్రతి ఏడాది మాదిరిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని, సాంప్రదాయాల మనుగడ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక కృషితో ప్రతి ఏడాది దండారి మహోత్సవాలు ఉట్నూరులోని తన నివాసం క్యాంపు కార్యాలయ ఆవరణలో దండారి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం దండారి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ మహోత్సవాలకు పెద్ద సిద్ధగూడ, దుర్గాపూర్, టక్కు గూడ ,నర్సాపూర్ (బి) గ్రామాల దండారీలతో పాటు మహిళలతో ఘనంగా దండారి మహోత్సవాలు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల దండారీలు, గ్రామాల పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు , పెద్ద సంఖ్యలో దండారి మహోత్సవాల్లో పాల్గొనడంతో ఎమ్మెల్యే నివాస ఆవరణ ప్రాంగణం కిటకిటలాడింది. మహిళలు చేసిన దండారి రేలారేలా నృత్యాల్లో ఎమ్మెల్యే సతీమణి వెడ్మ దుర్పత బాయి, కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ జిల్లా డిసిసి నాయకురాలు మెస్రం భాగ్యలక్ష్మి, జైనూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాధాబాయి, మహిళా నాయకురాలు మరుసకోల సరస్వతి, రంజన, మహిళలు నృత్యాలు చేశారు.
నాలుగు గ్రామాల దండారీలకు మహిళలకు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ స్వాగతం పలికి ఏర్పాట్లు పర్యవేక్షించారు. దండారీల నృత్యాలు, గుస్సాడీల నృత్యాలు, డప్పుల మోతలు మారుమోగాయి. ఈ ఉత్సవాలు రాత్రి వరకు పెద్ద ఎత్తున జరుగుతాయని ఎమ్మెల్యే అనుచరులు తెలిపారు. ఉత్సవాల్లో పాల్గొన్న దండారీలకు మహిళలకు ప్రజలకు నాయకులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ ఉత్సవాల్లో జై నూర్ ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు కుడిమేత విశ్వనాథ్ రావు, ఉత్తం ముఖాడే, అదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, పార్టీ అధ్యక్షులు డాక్టర్ దాస0డ్ల ప్రభాకర్, పట్టణ అధ్యక్షులు సయ్యద్ నిసార్, గ్రామాల్లో పట్టీలు సర్పంచులు, ఆదివాసీ నాయకులు ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.