ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజ్జన్న పుట్టినరోజు

09-11-2026 | 06:42pm

రక్తదానం చేపట్టిన అభిమానులు, కార్యకర్తలు..

సుల్తానాబాద్, నవంబర్ 09 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ విప్ , పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(Chintakunta Vijayaramana Rao) జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు, అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుట్టిన రోజును పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కనుకుల సింగిల్ విండో చైర్మన్ చిలుక సతీష్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద భారీ  ఎత్తున వేడుకలను చేపట్టారు. చౌరస్తాలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి భారీ కేక్ గజ మాలల డీజే సౌండ్ మధ్య విజ్జన్న గీతాలతో ఏర్పాట్లని చేపట్టారు.

వేడుకలకు హాజరైన విప్ కు ఘన స్వాగతం పలికిన అనంతరం గజమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సందర్శించి 200 మందికి పైగా రక్తదానం చేసిన వారందరిని విజయ రమణారావుఅభినందించారు, రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు మండలంలోని  గ్రామాల సర్పంచులు హాజరై రక్తదానం చేశారు. అనంతరం సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బిరుదు రాధాకృష్ణ ఆధ్వర్యంలో వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు గజమాలతో ప్రభుత్వ విప్ విజయరమణ రావు ని సన్మానించారు.

అనంతరం కేక్ కట్ చేయగా జన్మదిన శుభాకాంక్షలు పాలకవర్గం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్లు శ్రీగిరి శ్రీనివాస్, కల్లేపల్లి జానీ, భాస్కర్ రెడ్డి, మురళీధర్ రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మినుపాల ప్రకాష్ రావు,పట్టణ అధ్యక్షులు దన్నాయక దామోదర్ రావు, సాయిరీ మహేందర్, ముత్యాల రవీందర్,పన్నాల రాములు, అమిరిశెట్టి రాజలింగం, తిరుపతి, కందుకూరి ప్రకాష్ రావు, కుమార్ కిషోర్ ,  మండలంలోని సర్పంచులు, సింగిల్ విండో డైరెక్టర్లు, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు