ఘట్‌కేసర్ పోలీసుల సమయస్ఫూర్తి.. రెండు ప్రాణాలు సేఫ్!

09-11-2026 | 06:27pm

ఘట్ కేసర్, నవంబర్ 9 (విజయక్రాంతి) : రైల్వే ట్రాక్‌పై(Railway track) ఒక మహిళ తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు(Suicide) యత్నించడంతో  ఘట్ కేసర్ పోలీసులు(Ghatkesar Police) సకాలంలో చేరుకొని రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం ఎన్ ఎఫ్ సి నగర్ వద్ద రైల్వే ట్రాక్ పై ఒక మహిళ తన కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోల్-2 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, రైల్వే ట్రాక్‌పై ఉన్న మహిళను, ఆమె కుమార్తెను సకాలంలో రక్షించారు.

విచారణలో భర్త వేధింపుల కారణంగా మహిళ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. పోలీసులు వెంటనే ఆమెకు ధైర్యం చెప్పి కౌన్సెలింగ్ నిర్వహించి, పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం మహిళను, ఆమె కుమార్తెను సురక్షితంగా ఆమె సోదరి వద్దకు అప్పగించారు. ఈ సందర్భంగా సమయస్ఫూర్తితో స్పందించి రెండు ప్రాణాలను కాపాడిన పెట్రోల్-2 ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుల్ పరమేష్, సిబ్బందిని ఘట్కేసర్ ఇన్ స్పెక్టర్ కిరణ్  అభినందించారు.

ప్రజల ప్రాణాలు, భద్రత కాపాడటమే పోలీసుల ప్రథమ కర్తవ్యం అని అత్యవసర పరిస్థితుల్లో డయల్-112కు కాల్ చేయండని ప్రజలకు సూచించారు.

మరిన్ని వార్తలు