ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి
హనుమకొండ,నవంబర్ 09(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారానికి(Resolution of petitions) వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి(N. Ravi, Additional Collector of Hanamkonda District) సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్, హనుమకొండ, పరకాల ఆర్డీవో కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై అందిన అర్జీలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 అర్జీలు అందగా, ఆర్డీవో కార్యాలయాల్లో 6 అర్జీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 అర్జీలు (మొత్తం అర్జీలు84)అందాయి.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై అందించిన అర్జీల ను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో ఉండొద్దన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్, డి ఆర్ డి ఓ మేన శ్రీను, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.