ఆడబిడ్డలకు భరోసా కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

09-11-2026 | 06:39pm

సర్పంచ్ దున్నా శ్రీనివాస్ 

కోదాడ నవంబర్ 09 (విజయక్రాంతి) : తెలంగాణ ఆడబిడ్డలకు(daughters of Telangana) భరోసా కల్పించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ(Congress People's Government) లక్ష్యమని నడిగూడెం  సర్పంచ్ దున్నా శ్రీనివాస్ అన్నారు. సోమవారం కోదాడ(Kodad) శాసన సభ్యురాలు  నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆదేశాల మేరకు నడిగూడెం గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ యల్ మంగ గారితో కళ్యాణ్ లక్ష్మి చెక్కులను సోమవారం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులను ఆదుకునేందుకు, వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహ సిల్దార్ సుధీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కంభంపాటి చైతన్య, దున్న లింగయ్య, బాణాల నాగరాజ్, షేక్ రియాజ్, కాసాని గోపీనాథ్, రెవిన్యూ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు