అభివృద్ధి పనులను పర్యవేక్షించిన డిప్యూటీ మేయర్
ముకరంపుర, నవంబర్ 9 (విజయక్రాంతి): అభివృద్ధి పనులలో(development works) ఎక్కడ నాణ్యత లోపం రాకుండా వర్షం నీరు(Rainwater) సులువుగా వెళ్లేల లెవెల్స్ పాటిస్తూ ప్రజలకు అందమైన సిసి రోడ్డు(CC Road) అందుబాటులోకి తేవాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి(BJP State Spokesperson), నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Yadagiri Sunil Rao) తెలిపారు. కరీంనగర్ నగరపాలక సంస్థ(Karimnagar Municipal Corporation) 42 వ డివిజన్ భగత్ నగర్ లో సోమవారం పలు అభివృద్ధి పనులను యాదగిరి సునీల్ సునీల్ రావు ప్రారంభించి పర్యవేక్షించారు.
60 లక్షల రూపాయలతో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇదే క్రమంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి తగిన సూచన సలహాలు చేశారు. వర్షం నీరు సులువుగా పోయే విధంగా లెవెల్స్ పాటిస్తూ నాణ్యతలో ఎక్కడ లోపం రాకుండా ప్రజలకు అందమైన సిసి రోడ్డు త్వరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ గట్టు స్వామి, వర్క్ ఇన్స్పెక్టర్ ఖాలీద్, తదితరులు పాల్గొన్నారు.