పోస్టర్ ఆవిష్కరించిన నాయకులు

09-11-2026 | 06:24pm

సుల్తానాబాద్, నవంబర్ 09 (విజయక్రాంతి): రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం(State Ambedkar Youth Association) ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్ పట్టణంలోని   విశ్రాంతి భవనంలో  జిల్లా కన్వీనర్ పల్లె శాంతిరాజ్, జిల్లా కన్వీనర్ రమేష్, జిల్లా నాయకులు బచ్చలి రాజయ్య ల ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 14న సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి హైదరాబాదులో సమావేశం జరుగుతుందని మండలంలోని అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క , అడ్లురి లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు న్యాతరి శ్రీనివాస్, మంథని రమేష్, ఏనగందుల నాంపల్లి, పల్లె శ్రీనివాస్, న్యాతరి మహేందర్, మాటూరి రత్నం, న్యాతరి రాజకుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు