ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
17-11-2026 | 06:51pm
బోథ్: ఎల్ నినో(El Nino) ప్రభావాన్ని తట్టుకునేందుకు ప్రజలను ముందస్తు చర్యలు తీసుకునే విధంగా అధికారులు ప్రజా ప్రతినిధులు చైతన్యం చేస్తున్నారు. మంగళవారం మండలంలోని మర్లపల్లి గ్రామంలో సర్పంచ్ ఉప సర్పంచ్లతో పాటు అధికారులు రీఛార్జ్ స్ట్రక్చర్స్ ఫారం పండ్ల నిర్మాణంపై ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రతి బోర్ దగ్గర రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించుకోవాలని అంతేగాక నీటిని వృధా చేయవద్దని చెప్తున్నారు. కార్యక్రమంలో ఏపీఓ జగదేరావ్, టి.ఏ చంద్రశేఖర్, ఎఫ్ ఏ పోతన్న, వార్డు సభ్యులు తుకారం, అంబాజీ పాల్గొన్నారు.