మానుకోట అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

17-11-2026 | 06:52pm
  1. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి 
  2. 20.19 కోట్లతో రోడ్డు విస్తరణకు శంకుస్థాపన 

కేసముద్రం, నవంబర్ 17 (విజయక్రాంతి): మానుకోట సమగ్ర అభివృద్ధికి(Comprehensive Development of Manukota) రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలో మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం రవాణా సౌకర్యం మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి(Rajya Sabha member Vem Narender Reddy) తెలిపారు.

కేసముద్రం మండలం అర్పణ పల్లి నుండి వరంగల్ జిల్లా నాగారం గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న ఆర్ అండ్ బి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించడానికి 20.19 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే పనులను మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, ఎంపీ పోరిక బలరాం నాయక్ తో కలిసి కాట్రపల్లి వద్ద శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎదురబోయిన సూరయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధితో మారుమూల ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కి దోహదపడుతుందన్నారు. రవాణా వ్యవస్థ మెరుగు పడడం వల్ల గ్రామాలు పట్టణాలతో అనుసంధానించి అభివృద్ధికి  జరుగుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. పేదల ఆర్థిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి రాష్ట్రం దేశంలో ప్రథమ స్థానంలో నిలుస్తోందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం గూడూరు మండల పరిధిలో  పాకాల వాగు పై వంతెన నిర్మాణం, గూడూరు నుంచి నెక్కొండ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, పిసిసి సభ్యుడు గూగులోత్ దస్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు