విద్యార్థుల మధ్య ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు!

09-11-2026 | 08:18pm

ఆర్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ

మేడిపల్లి, నవంబర్ 09 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Enumula Revanth Reddy) జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మేడిపల్లి డివిజన్‌లో విద్యార్థుల(Students') మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివారం మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ(Medipally Division Congress Party) అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఆర్.వి. ఫౌండేషన్ ద్వారా మేడిపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హాస్టల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడం, వారికి అవసరమైన విద్యా సామగ్రిని అందించడం సామాజిక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ప్రిన్సిపాల్ శంకర్, డివిజన్ కాంగ్రెస్ నాయకులు, ఉపాధ్యాయులు,సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు