పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడులు
72 మంది పట్టివేత.. రూ.4.93 లక్షల నగదు స్వాధీనం
46 సెల్ఫోన్లు, 23 ద్విచక్ర వాహనాలు,4 కార్లు సీజ్...
బాన్సువాడ పట్టణ సీఐ తుల శ్రీధర్...
బాన్సువాడ, నవంబర్ 9 (విజయక్రాంతి): దీపావళి పండుగ వేళ అక్రమ పేకాట కార్యకలాపాలపై(illegal gambling activities) కామారెడ్డి జిల్లా బాన్సువాడ పోలీసులు కొరడా ఝుళిపించారు. బాన్సువాడ పోలీస్‌స్టేషన్(Banswada Police Station) పరిధిలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి భారీ సంఖ్యలో పేకాటరాయుళ్లను పట్టుకున్నట్లు పట్టణ సీఐ తుల శ్రీధర్ తెలిపారు.ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న మొత్తం 72 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4,93,980 నగదు, 46 సెల్ఫోన్లు, 23 మోటార్‌సైకిళ్లను,4 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలకు సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని సి ఐ శ్రీధర్ సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేకాట స్థావరాల నిర్వహణ, జూద కార్యకలాపాలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని సిఐ శ్రీధర్ స్పష్టం చేశారు.