భక్తి శ్రద్ధలతో కోనేటిలో దీపాలు
09-11-2026 | 08:15pm
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి బుగ్గ దేవాలయంలో భక్తుల(devotees) ప్రత్యేక పూజలతో సందడినేలకొంది. కార్తీక మాసం మొదటి సోమవారం బుగ్గదేవాలయం(Bugga Temple) కోనేటిలో మహిళా భక్తులు(devotees) దీపాలు వదిలి వాయనం ఇచ్చుకున్నారు. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే అమూరాజుల శ్రీదేవి రాజేశ్వర్, ఆలయ మాజీ ఛైర్పర్సన్ శ్రీదేవిశ్రీరాములు మాజీ సర్పంచ్ జిల్లాపల్లి స్వరూప కోనేటి లో దీపాలు వదిలి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వేణుగోపాల్, అర్చకులు. సతీష్ శర్మ భక్తులు పాల్గొన్నారు.