ఇందిరమ్మ ఇంట్లో మంత్రి 'పొన్నం' దీపావళి వేడుకలు
కోహెడ, నవంబర్ 9(విజయక్రాంతి): మండలంలోని వింజపల్లి గ్రామంలో(Vinjapalli Village) ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు(Indiramma House Beneficiary) పారునంది శంకరవ్వ నూతన (ఇందిరమ్మ ఇల్లు) గృహాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) సందర్శించారు. ఈ సందర్భంగా నూతన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పారునంది శంకరవ్వ నూతన వస్త్రాలు అందజేశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి బాణసంచా కాల్చారు. టపాసుల వెలుగుల మధ్య దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. స్వీట్ పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీజ జీవన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శెట్టి సుధాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్, గ్రామశాఖ అధ్యక్షులు బద్దం రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.