ఎట్టకేలకు రిమ్స్ దొంగలను పట్టుకున్న పోలీసులు

08-11-2026 | 12:25am

ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో చోరీ

ఇద్దరు అరెస్టు... వైద్య పరికరాల స్వాధీనం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు అత్యవసర చికిత్స అందించే వెంటిలేటర్లను చోరీ చేసిన ఘటనలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 30న రిమ్స్ ఆసుపత్రిలోని రెండు వార్డులో నుండి 4 వెంటిలేటర్ యంత్రాలను దొంగలు ఎత్తుకెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలలో చిక్కాయి. దీంతో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ టూ టౌన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీ ఫుటేజ్ ఆధారంగా మహారాష్ట్ర చంద్రపూర్‌కు చెందిన సజ్జన్ బాసన్ మోతే, అభిజిత్ అనే ఇద్దరు టెక్నీషియన్ లు రిమ్స్ లో నుండి 4 వెంటిలేటర్లను చోరీ చేసి మహారాష్ట్రకు తరలించారు. అనంతరం చోరీ చేసిన పరికరాలను  హైదరాబాద్‌కు చెందిన కొండా రెడ్డి కి విక్రయించారన్నారు. సజ్జన్ బసంత్ మోతే, కొండా రెడ్డి లను అరెస్టు చేయగా, అభిజిత్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

తులు ఆదిలాబాద్ తో పాటు నిజామాబాద్, మహారాష్ట్రలోని వణి జిల్లాలోని ఆసుపత్రుల్లో దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. నిందితుల నుండి రూ.32 లక్షల విలువైన వెంటిలేటర్లతో పాటు ఇతర వైద్య పరికరాలు రికవరీ చేశామన్నారు. మీడియా సమావేశంలో డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్  నాగరాజు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై అఖిల్, ఆర్ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది రమణ, క్రాంతి, త్రిశూల్, అఖిల్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు