కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవ

08-11-2026 | 12:24am

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar)  మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి కుమార్ ఇటీవల తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్  ఆస్పత్రిలో చేరగా, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి అలువేలి సమ్మిరెడ్డి విషయాన్ని కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా ఆ కుటుంబానికి అండగా నిలిచారు.

వెంటనే వారిని నిమ్స్ హాస్పిటల్‌లో చేర్పించి, వైద్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసి  ని మంజూరు చేయించారు. ఈ ఎల్ఓసి మంజూరు ప్రక్రియలో జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి ప్రత్యేక చొరవ చూపి, బాధిత కుటుంబానికి సహాయం త్వరగా అందేలా కృషి చేశారు. అనంతరం మంజూరైన ఎల్ఓసి పత్రాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు గద్దపాక గ్రామ ఉపసర్పంచ్ జంగా జైపాల్, అలాగే ముత్తారం గ్రామానికి చెందిన బూత్ అధ్యక్షులు కనకం రాజయ్య గారు తదితరులు పాల్గొని ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. విపత్కర పరిస్థితిలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఎల్ఓసి అందజేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి, ప్రత్యేక చొరవ చూపిన నాయకులకు తాళ్లపల్లి కుమార్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు