పిసిసి అధ్యక్షుడిని కలిసిన సంగారెడ్డి డిసిసి
నారాయణ ఖేడ్: హైదరాబాదులో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(PCC President Mahesh Kumar Goud) ను సంగారెడ్డి డిసిసి అధ్యక్షులు పి.చంద్రశేఖర్ రెడ్డి శనివారం వారి స్వగృహంలో మర్యాదపూర్ కలిసి దీపావళి శుభాకాంక్షలు(Diwali greetings) తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేయడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారని పేర్కొన్నారు.