పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

08-11-2026 | 12:04am

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): పర్యావరణానికి హాని కలిగించకుండా గ్రీన్ దీపావళి(Green Diwali) జరుపుకోవాలని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల(Nagarkurnool Government Science Degree College) ప్రిన్సిపల్ మదన్ మోహన్ పిలుపునిచ్చారు. శనివారం కళాశాలలో ఎకో క్లబ్ ఆధ్వర్యంలో గ్రీన్ దీపావళి వేడుకలు నిర్వహించి, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పర్యావరణహిత దీపావళి జరుపుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. వారితో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు