కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్
చొప్పదండి,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్య మద్దతు ధర పొందాలని గంగాధర సింగిల్ విండో చైర్మన్ దూలం బాలగౌడ్ అన్నారు. గంగాధర సింగిల్ విండో ఆధ్వర్యంలో మండలంలోని నారాయణపూర్ లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్మన్ బాలగౌడ్ మాట్లాడుతూ కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పురుమల్ల మనోహర్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు చిరుత మంగ, మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య,సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షులు ముద్దం నగేష్, సర్పంచ్ లు, దీకొండ బాబలక్ష్మి మధు, కోలేపాక కవిత మల్లేశం, కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, రేండ్ల రాజి రెడ్డి, ఆకుల అంజయ్య, జారతి సత్తయ్య, కడారి కుమారస్వామి, పెద్దోళ్ల రాజేశం, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.