సర్వసభ్య సమావేశం రసవత్తం

08-11-2026 | 12:15am

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గంగాధర్ ఎమ్మార్వో వెంకటరెడ్డి, మండల స్పెషల్ ఆఫీసర్ రాజ్ కుమార్, ఎంపీఓ ప్రభాకర్ చారి,మాల్తుమ్మెద సొసైటీ చైర్మన్ కలాలి సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం రసవత్తంగా కొనసాగింది. ఈ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు చెందిన మండల అధికారులు వారి ఎజెండా అంశాలను చదివి వినిపించారు. అయితే సర్వసభ సమావేశానికి మండల అధికారులు మాత్రమే హాజరవుతున్నారు.

డివిజన్ అధికారులు హాజరు కావడం లేదని సభ్యులు మండిపడ్డారు. అలాగే మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది ఎజెండా అంశాల బుక్  సభ్యులకు మీడియా మిత్రులకు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో సాయికిరణ్ మాట్లాడుతుండగా సభ్యులు జోక్యం చేసుకొని ఎలినో ప్రభావం వల్ల ఆరుతాడు పంటలపై అవగాహన కల్పించాలని తెలిపారు. మండలం చినుర్, వాడి, గోలిలింగాల, లింగంపల్లి, మాల్తుమ్మెద గ్రామాలలో యాసంగి పంటల కోసం రైతులు భూమి సాగు చేస్తున్నారని, బొల్లారం, మెల్లకుంట తండ జప్తి జాన్కంపల్లి, పల్లె బోగోడ తండా గ్రామాలకు పోచారం ప్రాజెక్టు సాగునీరు అందది కనుక ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సభ్యులు తెలిపారు.

ఐసిడి ఐసి అధికారులు గ్రామాల్లో పర్యటించినప్పుడు సర్పంచులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.మండల విద్యాశాఖ అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతుండగా బంజారా సర్పంచ్ సురేష్ జోక్యం చేసుకొని మండలంలోని ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయుల కొరత ఉందని 28 విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నాడని తెలుపగా విద్యార్థుల సంకెను బట్టి ఉపాధ్యాయులను నియమించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి తెలిపారు. అందుకోసం గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరేలా సర్పంచులు అవగాహన,ప్రోత్సాహం కల్పించాలని మండల విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డి తెలిపారు.

అలాగే అంగన్వాడి బిల్డింగుల కోసం తీర్మానాలు చేయాలని సభ్యులు సభలో తీర్మానించారు.మండలంలోని గ్రామాలలో పంట పొలాలకు వెళ్లడానికి మెటల్ రోడ్డు ఏర్పాటు కోసం తీర్మానాలు పంపించాలని అధికారులకు తెలిపారు.మండలం ప్రభుత్వ వైద్యాధికారి సృజన్ కుమార్ మాట్లాడుతూ...మండలంలో 16 క్యాన్సర్ వ్యాధి కేసులు ఉన్నాయని క్యాన్సర్ వ్యాధి కోసం వ్యాక్సిన్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రావడంలేదని దీనికోసం సర్పంచులు గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

గ్రామాలలో అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి కేంద్రాలను ఓపెన్ చేసి హాజరైసుకొని వెళ్తున్నారని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.కమ్యూనిటీ గుంతలపై సర్పంచులు గ్రామాలలో ఉన్న స్థలాలను ఎంపిక చేయాలని ఏపీఓ సక్కుబాయి తెలిపారు.అలాగే గ్రామ పంచాయతీలకు రూఫ్ టాప్ ప్రపోజల్ కూడా పంపించడం జరిగిందన్నారు.అనవసరమైన నీటి వాడకం తగ్గించాలని డిసెంబర్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఆర్అండ్బి ఏఈ రాజకుమార్  తెలిపారు.అటెండర్ల నిధులు ఇవ్వడం లేదని మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మురళీమోహన్ గౌడ్ సమావేశంలో తెలియపరచారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు