దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి...

16-11-2026 | 05:29pm

ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు..

ఉట్నూర్, నవంబర్ 16 ( విజయక్రాంతి ): ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో(Utnoor ITDA Office)  నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ('Praja Vani' (Public Voice) Program) ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి  మంద మకరందు అధికారులను ఆదేశించారు.

సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను ఆయన స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సిరికొండ మండలం లచ్చింపూర్ గ్రామానికి చెందిన కుంరం దీపక్ తమ గ్రామ చెరువు మరమ్మతుల కోసం దరఖాస్తు కాసిపేట్ మండలం   మాలకెపల్లి గ్రామానికి చెందిన భారతి తనకి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించమని గుడిహత్నూర్ మండలం తోషం గ్రామానికి చెందిన పీవీటిజీ గ్రామస్థులు తమకి కోళ్లు ఫారం ను మంజూరు కల్పించామని ఖానాపూర్ మండలం కొలం గూడ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కొరకు దరఖాస్తు అందజేసారు,

అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ప్రాజెక్టు అధికారి మంద మకరందు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు