లక్ష్మీపూర్‌లో ప్రభుత్వ భూములపై మట్టి దందా

28-11-2026 | 07:07pm

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

తంగళ్ళపల్లి,నవంబర్ 28 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ(Laxmipur village) పరిధిలో ప్రభుత్వ భూముల్లో(Government land) అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. గ్రామ అవసరాల కోసం బావి తవ్వుతున్నామనే సాకుతో కొందరు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు జేసీబీలు, టిప్పర్లతో భారీగా మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

అనుమతులకు విరుద్ధంగా లోతుగా తవ్వకాలు జరపడంతో ప్రభుత్వ భూముల(Government land) స్వరూపం మారిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ, మైనింగ్ శాఖల(Mining Departments) అధికారులు పరస్పరం బాధ్యతలు దాటవేస్తున్నారని విమర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ తవ్వకాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు