పురోగతిలో వేగం పెంచాలి
నిర్మల్ నవంబర్ 28 ( విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వ(Central Government) సౌజన్యంతో ప్రజల సంక్షేమం కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు(Welfare Schemes) అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అదిలాబాద్ ఎంపీ జి నాగేష్(Adilabad MP G. Nagesh) తెలిపారు. కలెక్టరేట్లో శనివారం దిశా మీటింగ్(Disha Meeting) నిర్వహించారు. కేంద్ర నిధులతో నిర్వహించబడుతున్న సంక్షేమ పథకాల పురోగతిపై శాఖల వారీగా సమీక్షించిన ఎంపీ పనుల్లో మందకోడితనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశంలో పురోగతి కనిపించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పాటిల్, అడిషనల్ కలెక్టర్లు వెంకట మాధవరావు, బి వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఓ విజయలక్ష్మి జిల్లా అధికారులు పాల్గొన్నారు.