సైన్స్ టాలెంట్ టెస్ట్‌లో కేజీబీవీకి మూడో స్థానం

28-11-2026 | 07:10pm

కోనరావుపేట నవంబర్ 28 (విజయక్రాంతి): సైన్స్ చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో(Science Chekumuki Talent Test) కోనరావుపేట కేజీబీవీ విద్యార్థులు(Students of Konaraopeta KGBV) జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచి మూడో స్థానాన్ని సాధించారు. విద్యార్థులు(Students) తమ ప్రతిభతో పాఠశాలకు మంచి పేరు తీసుకురావడం పట్ల ఉపాధ్యాయులు(Teachers), పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ టాలెంట్ టెస్ట్‌లో కేజీబీవీకి చెందిన కె. మానుసాయి (10వ తరగతి), పి. అపూర్వ (10వ తరగతి), ఎస్. కార్తిక (8వ తరగతి) పాల్గొని జిల్లా స్థాయిలో మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. విద్యార్థులు సైన్స్‌పై ఆసక్తి పెంచుకుని ఇలాంటి పోటీల్లో మరింత ప్రతిభ కనబరచాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు.

మరిన్ని వార్తలు