పేద ప్రజలకు అండగా ఆసరా పెన్షన్లు
తాంసి/భీంపూర్,నవంబర్17(విజయక్రాంతి): పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు ఎంతో భరోసానిస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Government welfare schemes) అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(Boath MLA Anil Jadhav) అన్నారు.
మంగళవారం తాంసి, భీంపూర్ మండలాలలో ఆసరా పెన్షన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని తాంసీలో 336,భీంపూర్ లో 555 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీంపూర్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,సకల హంగులతో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాదే అని అన్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు,అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి,మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డీ భోజ రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు,బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, లబ్దిదారులు,తదితరులు పాల్గొన్నారు.