సీసీ రోడ్డు పనులను పరిశీలించిన సీపీఐ కౌన్సిలర్
నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచన
ఖమ్మం రూరల్ విజయక్రాంతి:ఎదులాపురం మున్సిపాలిటీ(Edulapuram Municipality) పరిధిలోని 30వ వార్డులో మున్సిపాలిటీ నిధులతో (Municipality Funds) చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సీపీఐ కౌన్సిలర్ దండి శ్రీజ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతి, నిర్మాణ వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలం పాటు ప్రయోజనం కలిగేలా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా చూడాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ ఫరీద్, స్థానిక కాలనీవాసి సురభి సాయితో పాటు పలువురు పాల్గొన్నారు.