సంస్కృతి సాంప్రదాయాలను మరవవద్దు ఎంపీ జీ.నగేష్

07-11-2026 | 08:00pm

బోథ్,(విజయక్రాంతి): మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోవద్దని భావితరాలకు మన సంస్కృతి ఆచరించే విధంగా చూడాల్సిన అవసరం ఉందని ఎంపీ జి నగేష్(MP G. Nagesh) పేర్కొన్నారు. శనివారం సోనాల మండలంలోని గూడ గ్రామం(Guda Village)లో నిర్వహించిన గుస్సాడీ వేడుకల(Gussadi Festival)కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీని గ్రామస్తులు డప్పు వాయిద్యాలుసాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.

గుస్సాడి దండారి ముత్యాలు గొండి నృత్యాలతో కోలాటాలు వేస్తూ మహిళలు గిరిజన సంస్కృతి(Tribal Culture)ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా గ్రామ పటేల్ గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎంపీ కి వివరించారు. రోడ్డు సౌకర్యంతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించాలని కోరారు.

స్పందించిన ఎంపీ గ్రామ సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి రాజు, రైల్వే బోర్డు మాజీ సభ్యులు జీవీ రమణ, రాజేశ్వర్ రెడ్డి సహకార సంఘం అధ్యక్షులు కదం ప్రశాంత్, మెస్రం భూమన్న జాదవ్ రమేష్ మండల పార్టీ కన్వీనర్ బోరే రవీందర్ , దిశ డైరెక్టర్ పెందుర్తి రామ్, పెట్టం రాములు యాదవ్, జూగాది రావు, గ్రామ పటేల్ తో పాటు సార్ మేడి గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు