లబ్ధిదారులంతా ఆనందంగా దీపావళి జరుపుకోవాలి

07-11-2026 | 10:08pm

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులతో కలిసి మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి, పోస్టర్‌ను విడుదల చేశారు. రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. దీపావళి పండుగ రోజున ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులంతా తమ సొంత ఇళ్లలో దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులతో, సుఖసంతోషాలతో పండుగ జరుపుకోవాలని కోరారు. తమకు సొంతింటిని అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయాలని, పేదప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు