అనారోగ్య బాధితురాలికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

07-11-2026 | 10:17pm

మంత్రి శ్రీధర్ బాబు చొరవతో కేతిరి హన్సికి వైద్యసాయం

మంథని,(విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంథని పట్టణానికి చెందిన కేతిరి హన్సికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అండగా నిలిచారు. ఆమె వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా రూ.2 లక్షల 50 వేల విలువైన లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మంజూరు చేయించారు.

వైద్య చికిత్స కోసం ఆర్థిక సహాయం కావాలని బాధితురాలి కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీని అందజేశారు. ఆపద సమయంలో స్పందించి వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు కేతిరి హన్సి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు