అపస్మారక వ్యక్తికి తక్షణ సాయం

07-11-2026 | 10:05pm

బ్లూ కోల్ట్ సిబ్బందికి క్యాష్ రివార్డ్ ప్రకటించి అభినందించిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): డయల్ 112కు వచ్చిన అత్యవసర సమాచారం మేరకు తక్షణమే స్పందించిన గణపురం బ్లూ కోల్ట్ పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సకాలంలో ప్రథమ చికిత్స అందించి మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గుట్టం శ్రీను మూర్చ కారణంగా అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం అందడంతో బ్లూ కోల్ట్ కానిస్టేబుల్ పీసి మోహన్, హెచ్ జి రాకేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు.

అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో స్పందించి బాధితుడికి సకాలంలో సహాయం అందించిన బ్లూ కోల్ట్ సిబ్బంది పీసి మోహన్, హెచ్ జి రాకేష్‌లను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రత్యేకంగా అభినందించడంతో పాటు క్యాష్ రివార్డ్ అందించి ప్రోత్సహించారు. ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తూ, విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బందిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని ఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు