టిఆర్ఎస్ నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు

11-11-2026 | 03:28pm

బోథ్. నవంబర్ 11 (విజయ క్రాంతి): బోథ్ నియోజకవర్గంలో(Both Constituency) తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ రోజురోజుకు దూకుడు పెంచుతున్నది. ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తనదైన చర్యలు గతంలో తన వెంట అనుచర వర్గాన్ని టిఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇటీవల ఆ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. 

గ్రామాలపై ఫోకస్...

నియోజకవర్గంలో తన అనుచర వర్గంపై మాజీ ఎమ్మెల్యే దృష్టి సారించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి పట్టు ఉన్న నాయకులపై దృష్టి సారించి టిఆర్ఎస్ పార్టీలో చేర్పించుకుంటున్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సభ విజయవంతం కావడంతో టిఆర్ఎస్ పార్టీకి కొత్త ఊపునిచ్చినట్లు అయింది.

గతంలో తనతో కలిసి పని చేసిన వారికి పదవులను కట్టబెట్టి మండల స్థాయి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచే అభ్యర్థులను ఇప్పటి నుండే గుర్తిస్తున్నారు. వారిని తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వివిధ పార్టీలలో అసంతృప్తి వాదులను టిఆర్ఎస్ పార్టీలో చేర్పించేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. 

గ్రామ గ్రామాన టీఆర్ఎస్ జెండా...

నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో టీఆర్ఏ పార్టీ జెండాలను ఆవిష్కరించేందుకు సన్నద్ధమవుతున్నారు. గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తే రానున్న రోజుల్లో పార్టీ బలపడే ఆస్కారం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మండల కమిటీల ఏర్పాటు అనంతరం గ్రామ కమిటీలు ఏర్పాటు పై ఆయన దృష్టి సారించినట్లు తెలిసింది.

రాను అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలని రాష్ట్ర అధ్యక్షురాలు నిర్ణయించడంతో స్థానిక జిల్లా ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే తనదైన శైలిలో పార్టీలోకి గ్రామస్థాయి నాయకులు ఆహ్వానిస్తున్నారు. ఇది ఏమైనా రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం గెలుపు ఓటములను నిర్ణయించేదిగా ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు