విద్యారంగ అభివృద్ధికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం

11-11-2026 | 04:15pm

ఆసిఫాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): దేశంలో విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్(Maulana Abul Kalam Azad) చేసిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. బుధవారం ఆజాద్ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీతో కలిసి పాల్గొన్న ఆజాద్ దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎం.డి. అహ్మద్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు