సిద్దిపేటలో అంకుర ఉమెన్ ఫర్టిలిటీ, చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవం
ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు హాజరు
సిద్దిపేట, నవంబర్ 11 (విజయక్రాంతి): సంతానలేమి సమస్యలతో(Infertility issue) బాధపడుతున్న మహిళలకు మెరుగైన వైద్య సేవలు (Medical Services) అందించడంతో పాటు, చిన్నారులకు అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీ అంకుర ఉమెన్ ఫర్టిలిటీ, చిల్డ్రన్స్ హాస్పిటల్‌ను(Sri Ankura Hospital) ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, గౌరవ శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ నిహార్, డాక్టర్ శ్రావిక మాట్లాడుతూ.. సంతానలేమి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న మహిళలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు.
చిన్నారుల్లో ఎదురయ్యే వివిధ ఆరోగ్య సమస్యలకు అధునాతన వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్స అందిస్తామని పేర్కొన్నారు. నూతన భవనంలో ఆసుపత్రిని ప్రారంభించి సిద్దిపేట ప్రజలకు మరింత చేరువగా వైద్య సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.