రెండు రాష్ట్రాల సరిహద్దుల గుర్తింపు
ఎర్రుపాలెం నవంబర్ 11( విజయ క్రాంతి): భూముల రీ సర్వేలో(Re-survey of lands) భాగంగా ఎర్రుపాలెం మండలంలోని కేసిరెడ్డిపల్లి, ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవరం, పెద్దాపురం గ్రామాల సమీపంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు నిర్ధారణ బుధవారం జరిగింది.
ఖమ్మం జిల్లా డి ఐ ధర్మారావు, ఎన్టీఆర్ కృష్ణ జిల్లా నందిగామ డి ఐ సాంబశివరావుల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సునీత ఎలిజబెత్ , ఆర్ ఐ రవికుమార్, సర్వేయర్ రాజశేఖర్ , వీరులపాడు మండల జయంతి విలేజ్ సర్వేయర్ జయంతి గ్రామ సర్వేయర్, జి మాధవరం గ్రామ సర్వేయర్, కేశిరెడ్డిపల్లి జిపిఓ లైసెన్స్ సర్వేయర్లు పాల్గొన్నారు.