జనరిక్ మందులతో ప్రజలకు భారీ ఊరట

11-11-2026 | 04:05pm
  1. 20 నుంచి 80 శాతం వరకు రాయితీతో నాణ్యమైన మందులు
  2. జిల్లా కలెక్టర్ కె.హరిత

ఆసిఫాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): జనరిక్ మెడికల్ షాపుల(Generic medical shops) ద్వారా ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ కె.హరిత(District Collector K. Haritha) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ వెంకట్, ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కిరణ్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనరిక్ మందులపై 20 నుంచి 80 శాతం వరకు రాయితీ లభిస్తుందని తెలిపారు. ఖరీదైన మందులు కొనలేక ఇబ్బందులు పడే పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ షాపులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. రోగులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు