బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ఎర్రుపాలెం నవంబర్ 11 (విజయ క్రాంతి):ఎరుపాలెం నందు గల వైన్ షాప్ ముందర విజయవాడ(Vijayawada) నుండి భీమవరం గ్రామం (Bhimavaram Village) వెళుతున్న ఏపీఎస్ఆర్టీసీ(APSRTC bus) బస్సు రోడ్డు దాటుతున్న ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొనటం వలన సదర వ్యక్తికి రక్తపు గాయాలయ్యాయి.
సదర వ్యక్తిని 108 వాహనంలో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయిస్తుండగా చికిత్స పొందుతూ రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో చనిపోయినాడు ఇట్టి గుర్తుతెలియని వ్యక్తి వయసు సుమారు 50 నుండి 60 మధ్య సంవత్సరాలు కలిగి ఉన్నాడు మరియు చామన చాయ రంగు కలిగి మృతుని శరీరంపై నలుపు రంగు నిండు చేతులు చొక్కా నలుపు రంగు పాయింట్ కలిగి కొద్దిగా బట్టతల కలిగి నలుపు తెలుపు వెంట్రుకలు కలిగి గడ్డం మాసిపోయి ఉన్నది.
మృతుని శరీరంపై కుడిచేతి భుజం పైన మరియు కుడి మోకాల పైన పుట్టుమచ్చలు కలవు మరియు మృతిని చాతి భాగంలో గతంలో ఆపరేషన్ జరిగిన మానిన గాయాలు కలవు ఇట్టి గుర్తుతెలియని పురుషుని యొక్క మృతదేహంను గుర్తించిన ఎడల ఎర్రిపాలెం ఎస్సై రమేష్ కుమార్ సెల్ నెంబర్ 8712659164, ఎరుపాలెం పోలీస్ స్టేషన్ నెంబర్ 8712659165 సమాచారం ఇవ్వగలరు.