మోటర్ సైకిల్ ను ఢీకొట్టిన కారు

11-11-2026 | 03:55pm

దంపతుల దుర్మరణం 

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లచ్య తండాకు చెందిన బానోత్ సోమా, పద్మ దంపతులు బుధవారం రోడ్డు ప్రమాదంలో(Road accident) మృతి చెందారు. తండా ధర్మారం స్టేజీ సమీపంలో భార్యాభర్తలిద్దరూ బైక్‌పై వెళ్తుండగా, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. దంపతుల మృతితో లచ్య తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని వార్తలు