భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి
భద్రాచలం (విజయ క్రాంతి) : భద్రాచలంలోని(Bhadrachalam) శ్రీ సీతారామచంద్ర స్వామివారిని చినజీయర్ స్వామి(Chinajeeyar Swamy) శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వైదిక సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలకగా ఆలయంలో ప్రత్యేక పూజలు(Special prayers) నిర్వహించారు. అనంతరం రామాలయ అభివృద్ధి(Development of the Rama Temple) విస్తరణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సమయంలో రామాలయంలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి దేవస్థానం ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రవీంద్రనాథ్ చిన జీయర్ స్వామికి మాస్టర్ ప్లాన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో కె దామోదర్ రావు, ఏఈఓ శ్రవణ్ కుమార్, పర్యవేక్షకులు లింగాల సాయిబాబా,స్థానాచార్యులు కేఈ స్థల శాయి, ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవన్ పాల్గొన్నారు.