బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్దంతి

28-11-2026 | 09:56pm

కోదాడ,(విజయక్రాంతి): సామాజిక విప్లవానికి ఆద్యుడు, బహుజన ఉద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి(Mahatma Jyotirao Phule Death Anniversary)ని బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోదాడ పట్టణ పార్టీ అధ్యక్షుడు షేక్ నయీమ్(Kodad Town Party President Sheikh Naeem) హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చదువే శక్తి, చదువే ముక్తి అని చాటి చెప్పిన మహనీయుడు పూలే అని కొనియాడారు. కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనపై ఆయన అలుపెరగని పోరాటం చేసిన యోధుడని పేర్కొన్నారు.

స్త్రీ విద్య కోసం భారతదేశంలోనే మొదటి బాలికల పాఠశాలను స్థాపించిన గొప్ప సంఘసంస్కర్త అని, సత్యశోధక సమాజాన్ని స్థాపించి సమాజ చైతన్యానికి కృషి చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు ఉపేందర్, పురపాలక సంఘం సభ్యుడు నరేష్ బాబు, పదహారో వార్డు బాధ్యుడు కరీముల్లా బాబా, ముప్పై ఐదో వార్డు బాధ్యుడు బత్తుల ఉపేందర్, ముప్పై రెండో వార్డు బాధ్యుడు మాదాల ఉపేందర్, పిట్టల భాగ్యమ్మ, దొంగరి శీను, చలిగంటి వెంకట్, పొదిల క్రాంతి, కందుల శ్రీకాంత్, జానీ, చీమ శీను, దస్తగీర్, అలీం, గంధం శీను, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు