మహిళా సంక్షేమానికి పెద్దపీట
ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
హజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు రెండో విడత ఇందిరమ్మ చీరల(Indiramma Sarees) పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) శని వారం అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, DRDO కిషన్ తో కలిసి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించడంతో పాటు సమాజంలో గౌరవప్రదమైన స్థానం పొందేలా ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. మహిళల ఆత్మగౌరవానికి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టడం సంతోషకరమని తెలిపారు.
అనంతరం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో హజీపూర్ తహసిల్దార్ పుష్పలత, MPO సుమన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, మంచిర్యాల సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వరరావు, హజీపూర్ మండల అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ తోట రవి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాలే రాయలింగు, స్థానిక సర్పంచ్ బేతు రమాదేవి, నాయకులు తనుగుల సత్యం గౌడ్, రేవెల్లి ప్రసాద్, గూడ అంజి, కోట నవీన్ గౌడ్, జాడి విజయ్, సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్ విండో డైరెక్టర్లు, మహిళా సంఘ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.